Loading Events

« All Events

  • This event has passed.

Striving for Hearing Impaired Free Kandukur Constituency: Nalini Devi

December 3, 2023 All day

Amaravathi Jyothi – Andhra Pradesh / SPSNellore : వినికిడి సమస్య లేని కందుకూరు నియోజక వర్గం కోసం కృషి :నళినీ దేవి. 145 మందికి నిపుణులచే పరీక్షలు. కందుకూరు, అమరావతి జ్యోతి: వినికిడి సమస్య లేని కందుకూరు నియోజకవర్గం కోసం రామయ్య ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తాము శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్టు రామయ్య ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ ఉన్నం. నళినీ దేవి అన్నారు.. తాను చైర్మన్ గా ఉన్న ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో గతంలో చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలను వెల్లడించారు. కందుకూరు నియోజకవర్గానికి వినికిడి సమస్య లేని నియోజక వర్గం వలె తీర్చి దిద్దేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నట్లు నళినీ దేవి పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే కందుకూరు నియోజక వర్గ పరిధిలోగల గ్రామాలలోని ప్రజల నుంచి వినికిడి సమస్య గల వారి నుంచి దరఖాస్తులను కోరగా సుమారు 150 దరఖాస్తులు వచ్చాయనీ అందులో 145 మందికి పరీక్షలు నిర్వహించినట్లు ఆమె తెలిపారు. ఈ కార్య క్రమానికి విశిష్ట అతిధులుగా డాక్టర్.నల్లూరి మురళి కృష్ణ ,డాక్టర్ పూర్ణ చంద్ర రావు, ఆర్ ఎస్ ఎస్ విభాగ ప్రచారక్ చంద్రశేఖర్,డాక్టర్ మల్లికార్జున, ఘట్టమనేని హరి బాబు, పిడికిటి అరుణ , డీన్ దయాల్ శ్రావణ ఫౌండేషన్ ఛైర్మెన్ హరి కృష్ణ ,డాక్టర్ రవి తేజ. పరీక్షల అనంతరం నిపుణుల సిఫారసు మేరకు వినికిడి యంత్రాలను సేకరించడం జరుగుతుందని, త్వరలోనే వారికి వినికిడి యంత్రాలు పంపిణీ చేయడం జరుగుతుందని రామయ్య ఫౌండేషన్ ట్రస్ట్ నిర్వాహకులు ఉన్నం హరిబాబు, నళినీ దేవి తెలిపారు. వినికిడి పరీక్షలు చేయించుకున్న వారికి మధ్యాహ్నం భోజనం ఆ ట్రస్ట్ నిర్వాహకులు ఏర్పాటు చేశారు

 

Details

Date:
December 3, 2023